- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగిసిన కేబినెట్ భేటీ.. మరికొద్దిసేపట్లో ప్రెస్ మీట్
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు జరిగిన కేబినెట్ మీటింగ్ ముగిసింది.

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు జరిగిన కేబినెట్ మీటింగ్ ముగిసింది. అయితే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఈ వ్యవహారంపై వచ్చే కేబినెట్ లో చర్చించనున్నారని తెలుస్తోంది. నవంబర్ 7న మరో కేబినెట్ సమావేశం జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం హైకోర్టులో ఉండగా... నవంబర్ 3న కోర్టులో విచారణ జరగనుంది. కోర్టు నిర్ణయాన్ని బట్టి తదుపరి కేబినెట్ సమావేశంలో స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
కాగా ఈరోజు జరిగిన కేబినెట్ మీటింగ్ లో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3) తొలగింపునకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అంశాలపై కొద్దిసేపట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించనున్నారు.






