బీసీ రిజర్వేషన్లకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. సంబురాలకు టీపీసీసీ పిలుపు

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం విదితమే.

బీసీ రిజర్వేషన్లకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. సంబురాలకు టీపీసీసీ పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పార్టీ శ్రేణులకు కీలక పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో సంబరాలు నిర్వహించాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. రిజర్వేషన్ల అమలుకు 2018లో తెచ్చిన చట్టాన్ని తిరిగి సవరించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. అదేవిధంగా మంత్రివర్గ సమావేశాల్లో ఆమోదించిన అంశాల అమలుపై సమీక్షించామని ప్రకటించారు. దేశానికే మార్గదర్శకంగా తెలంగాణ (Talangana)లో చెప్పిన విధంగా కులగణన (Cast Census)ను విజయవంతంగా పూర్తి చేశామని.. ఇది దేశ చరిత్రలోనే ఓ మైలురాయని కాంగ్రెస్ శ్రేణులు అభివర్ణించాయి.

Next Story