రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఖాయం.. పార్టీ శ్రేణులకు గులాబీ బాస్ సంచలన పిలుపు

by Kema Shiva Kumar |

బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఖాయం.. పార్టీ శ్రేణులకు గులాబీ బాస్ సంచలన పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. మూడు నెలల్లోపు శాసనసభ స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని తేల్చి చెప్పింది. అదేవిధంగా న్యాయస్థానమే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. అదేవిధంగా ఇదే కేసులో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును డిస్మిస్ చేసింది. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు తీర్పుపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావడం పక్కా కామెంట్ చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఉపఎన్నికలకు పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే సన్నద్ధం చేయాలని నాయకులకు సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలా కృషి చేయాలని అన్నారు. ఆ ఎన్నికల తర్వాతే పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిద్దామని కేసీఆర్ పేర్కొన్నారు.

బనకచర్ల ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ స్టేట్‌మెంట్లు ఇస్తున్నా.. సీఎం రేవంత్ ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని ఊరూరా ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి లోక్‌సభలో డజన్ మంది ఎంపీలు ఉంటే బనకచర్ల అంశంపై గట్టిగా కొట్లాడేవారని పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీల చేతగానితనంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఫైర్ అయ్యారు. బనకచర్లపై రాజకీయ, న్యాయపరమైన పోరాటానికి బీఆర్ఎస్ సన్నద్ధం కావాలని తెలిపారు. సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పాటు బహిరంగ‌ సభ నిర్వహించేందుక ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేలా పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేయాలని అన్నారు. ఈ నెల 8న కరీంనగర్ సభ తర్వాత రాష్ట్రపతిని పార్టీ ప్రతినిధి బృందం కలిసి బీసీ రిజర్వేషన్ల అమలుకు విజ్ఞప్తి చేయబోతోందని పార్టీ శ్రేణులకు కేసీఆర్ తెలిపారు.

Next Story