- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హెచ్ టీ, బీటీ విత్తనాలు కొనుగోలు చేస్తే అనేక నష్టాలు తప్పవు : రైతు కమిషన్
రాష్ట్రంలో రైతులను మోసం చేసేందుకు పత్తి విత్తన కంపెనీలు విచ్చిల విడిగా పుట్టకొస్తున్నాయని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని రైతు కమిషన్చైర్మన్ కోదందరెడ్డి కోరారు. పత్తి విత్తనాలు చాలా రకాల ఉన్నాయని, వాటిలో బాగా పండే విత్తనాలు కొనుగోలు చేయాలని, నాసిరకం విత్తనాలు కొనుగోలు చేస్తే నష్టపోతారని సూచించారు.

దిశ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రైతులను మోసం చేసేందుకు పత్తి విత్తన కంపెనీలు విచ్చిల విడిగా పుట్టకొస్తున్నాయని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని రైతు కమిషన్చైర్మన్ కోదందరెడ్డి కోరారు. పత్తి విత్తనాలు చాలా రకాల ఉన్నాయని, వాటిలో బాగా పండే విత్తనాలు కొనుగోలు చేయాలని, నాసిరకం విత్తనాలు కొనుగోలు చేస్తే నష్టపోతారని సూచించారు. మంగళవారం తమ కార్యాలయంలో మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ పత్తి విస్తీర్ణం బాగా పెరిగిందని, ఇదే అదునుగా భావించి మల్టీనేషనల్ కంపెనీలు జోరబడి నకిలీ విత్తనాలు తక్కువ ధరకే అమ్మకాలు చేస్తూ రైతులను అప్పుల పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రభుత్వం బీటీ, హెచ్టీ విత్తనాలు నిషేదించిన కంపెనీలు అక్రమ సంపాదనకు తెగబడ్డాయని మండిపడ్డారు. జెన్యూ మార్పిడి విత్తనాలు భారత్ లో విస్తారంగా అమ్ముకోవాలని అప్పట్లో మల్టీ నేషనల్ కంపెనీలు ప్రయత్నం చేశాయని 2006లో తెలంగాణలో వంకాయ మీద జెన్యూ మార్పిడి అమ్మడానికి ప్రయత్నం జరిగింది.
ఆ కంపెనీలు రైతులను ఏసీ బస్సులో తీసుకొచ్చి వారికి అనుకూలంగా అనుకూలంగా మాట్లాడించుకుని ఇక్కడ అమ్మకాలు చేసేందుకు ఎత్తుగడలు వేస్తే ఇక్కడ ప్రభుత్వం వీటితో ప్రమాదం ఉందని నాటి మంత్రి రోషయ్య జన్యు మార్పిడి విత్తనాలు తమ రాష్ట్రంలో అవసరం లేదని అప్పటి పీఎం మన్మోహన్సింగ్కు లేఖ రాశారు. మల్టీ నేషనల్కంపెనీలు రాకుండా చర్యలు తీసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల ప్రాంతాల్లో పత్తి ఎక్కువ పండిస్తారని అక్కడ రైతులకు నకిలీ విత్తనాలు కంపెనీలు అంట గడుతున్నాయని పేర్కొన్నారు. అదే విధంగా రైతులు పత్తి చేనులో కలుపు పెరగడకుండా ఉండేందుకు గ్లైపోసైట్ మందును వాడటంతో భూమి విషంగా మారుతుందన్నారు. ఆదిలాబాద్ జిల్లాల్లో అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారని మా దృష్టికి వచ్చిందని రైతులు ఈ కలుపు మందులు వాడొద్దని విజ్ఞప్తి చేశారు. అమెరికాలో ఉండే విత్తన కంపెనీలు కూడా అక్కడే పరీక్షలు చేసుకొని అక్కడి నుంచే సర్టిఫికెట్ తెచ్చుకొని ఇక్కడి రైతులకు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం ఇటీవల తెచ్చిన సీడ్ డ్రాఫ్ట్ కంపెనీలకు అనుకూలంగా ఉంది. వచ్చే బడ్జెట్ సెషన్ లో బిల్లు పెట్టాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతులు నకిలీ కంపెనీల పట్ల జాగ్రత్తంగా ఉండాలని సూచించారు.






