1532 రోజులు నిరాహార దీక్ష చేసిన వ్యక్తిని కేసీఆర్ మరిచిపోయిండు.. బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్

by Dishafeatures2 |
1532 రోజులు నిరాహార దీక్ష చేసిన వ్యక్తిని కేసీఆర్ మరిచిపోయిండు.. బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ పై బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరించిన ఎందరో ఉద్యమకారులను సీఎం కేసీఆర్ పట్టించుకోవడంలేదని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 1532 రోజుల పాటు రిలే నిరాహార దీక్ష చేసిన పెద్దపల్లి జిల్లాకు చెందిన పారుపల్లి వైకుంఠపతి ముదిరాజ్ ను సీఎం కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వరాష్ట్రంలో బీసీ నేతలపై కేసీఆర్ కు ఉన్న వివక్షతకు ఇది నిదర్శనమని అన్నారు.

వైకుంఠపతి బతికుంటే ఈ రోజు శాసనసభలో ఉండాల్సిన వ్యక్తి అని ఆర్ఎస్ ప్రవీణ్ అభిప్రాయపడ్డారు. కానీ ఆయన కుటుంబాన్ని రాజకీయంగా ఎదగకుండా కేసీఆర్ ప్రభుత్వం, ఆయన అనుచరులు అడ్డుకున్నారని ఆరోపించారు. ఆధిపత్య పార్టీలల్లో పని చేసే బహుజన నాయకులకు, కార్యకర్తలకు ఇలాంటి అవమానాలు తప్పవని అన్నారు. అందుకే అధికారం, హోదా, గౌరవం దక్కాలంటే బహుజన నాయకులు, కార్యకర్తలు బీఎస్పీలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.


Next Story

Most Viewed