- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్ పై మరోసారి కేటీఆర్ విమర్శలు.. నిందలు, దందాలు, చందాలేనంటూ ఫైర్
ఇంకా కాంగ్రెస్ (Congress Government)ను ఎన్ని రోజులు భరించాలని ప్రజలు అంటున్నారని, ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం కాంగ్రెస్ ఇచ్చిన అభయహస్తం హామీ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. సోమవారం గద్వాల నియోజకవర్గం నుంచి కేటీఆర్ సమక్షంలో పార్టీలో భారీగా చేరికలు జరగగా.. వారందరికీ తెలంగాణ భవన్లో (Telangana Bhavan) కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ను వీడి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు ఉపఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు.
ఇంకా కాంగ్రెస్ (Congress Government)ను ఎన్ని రోజులు భరించాలని ప్రజలు అంటున్నారని, ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం కాంగ్రెస్ ఇచ్చిన అభయహస్తం హామీ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఒక పక్క రాష్ట్రానికి అప్పులు పుట్టడం లేదంటూనే.. మరో పక్కన తెలంగాణ రైజింగ్ (Telangana Rising) అని చెప్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మూటల మనిషి అని మరోసారి రుజువైందన్నారు. సీఎం చేస్తున్న, మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆయన మానసిక పరిస్థితిపై అనుమానం కలుగుతోందన్నారు. నిందలు, చందాలు, దందాలే కాంగ్రెస్ ప్రభుత్వ తీరని, రేవంత్ ఢిల్లీకి మూటలు మోస్తున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీ పార్టీలను నమ్ముకుంటే మోసపోతామని కేసీఆర్ చెప్పారన్న కేటీఆర్.. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.






