SLBC ఘటనపై దర్యాప్తునకు ఒక్క బృందాన్ని కూడా ఎందుకు పంపలేదు?: కేటీఆర్‌

by Naga Rani Yarlagadda |

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం (SLBC Tunnel) కూలిపోయి 8 మంది అభాగ్యులు మరణించి 200 రోజులైంది. ఇప్పటి వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు.

SLBC ఘటనపై దర్యాప్తునకు ఒక్క బృందాన్ని కూడా ఎందుకు పంపలేదు?: కేటీఆర్‌
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం (SLBC Tunnel) కూలిపోయి 8 మంది అభాగ్యులు మరణించి 200 రోజులైంది. ఇప్పటి వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్(X) వేదికగా పోస్ట్ చేశారు. అవినీతి పరుడైన రేవంత్ (CM Revanth Reddy) సర్కార్ నిర్లక్ష్యం కారణంగా.. ప్రమాదంలో మరణించిన 8 మందిలో ఆరుగురి మృతదేహాలను కూడా వెలికి తీయలేకపోయిందని దుయ్యబట్టారు. పైగా బాధితుల కుటుంబాలకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదని అసహనం వ్యక్తం చేశారు.

ఇదే సమస్యపై కేంద్రాన్ని కూడా కేటీఆర్ నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో (Kaleswaram Project) తలెత్తిన చిన్న సమస్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీమ్ ను రాష్ట్రానికి పంపి హంగామా చేసిన కేంద్ర ప్రభుత్వం.. SLBCలో లోపాలపై దర్యాప్తు చేసేందుకు మాత్రం ఏ బృందాన్నీ పంపలేదన్నారు. బీజేపీ బడేభాయ్.. తెలంగాణలో కాంగ్రెస్ చోటే భాయ్ ను ఎందుకు ఎప్పుడూ కాపాడుతోంది? ఈ అపవిత్ర బంధానికి కారణమేంటి? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆరుగురు సజీవ సమాధి అయినా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు.

బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన రోజున ఆ ఆరు కుటుంబాలకు న్యాయం చేస్తామని, ఈ దారుణానికి కారణమైన వారు తగిన మూల్యం చెల్లించుకుంటారని తెలిపారు. టన్నెల్ ప్రమాదానికి కారణమై, కార్మికుల ప్రాణాలను బలిగొన్నవారికి శిక్షపడేలా చేస్తామని ఎక్స్ పోస్టులో కేటీఆర్ వాగ్దానం చేశారు.

Next Story