- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BRS: ఆ కుటుంబాల మనోవేదనలే సర్కారుకు మరణ శాసనం.. మాజీమంత్రి కేటీఆర్ ఫైర్
కాంగ్రెస్ ప్రభుత్వ పాలన(Congress Governance) రైతు రాజ్యం కాదని, రైతు వంచన రాజ్యం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working president KTR) విమర్శించారు.

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వ పాలన(Congress Governance) రైతు రాజ్యం కాదని, రైతు వంచన రాజ్యం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working president KTR) విమర్శించారు. రైతు ఆత్మహత్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. ఒకే రోజు నలుగురిని పొట్టన పెట్టుకున్న ప్రభుత్వమిది! అని, రైతు రాజ్యం కాదిది.. రైతు వంచన కొనసాగిస్తున్న రాజ్యమిది! అని మండిపడ్డారు. అంతేగాక ముమ్మాటికీ రైతులను ఆదుకునే సంక్షేమ ప్రభుత్వం కాదిది.. తోడేళ్ళలా ప్రాణంతీసే క్రూరత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యమిది! అని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కాదు ఇది ఖూనీకోర్ అంటూ.. ఆత్మహత్యలు కాదివి.. ముమ్మాటికి మీరు చేసిన హత్యలు అని ఆరోపించారు. ఇక రుణమాఫీ చేయకుండా తీసిన ప్రాణాలు.. రైతుబంధు వేయకుండా చేసిన ఖూనీలు.. ఆ కుటుంబాల మనోవేదనలే మీ సర్కారుకు మరణ శాసనం రాస్తాయని, వారి కన్నీళ్లే కపట సర్కార్ ను కూల్చి వేస్తాయని కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.






