సిద్దిపేటలో బీఆర్‌ఎస్ ప్రభంజనం: స్థానిక ఎన్నికల్లో 'వార్ వన్ సైడ్'

by Malleboina Mahesh |

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల రెండో విడత ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. సిద్దిపేట నియోజకవర్గంలో ఫలితాలు 'వార్ వన్ సైడ్' అన్నట్లుగా ఏకపక్షంగా వెలువడ్డాయి.

సిద్దిపేటలో బీఆర్‌ఎస్ ప్రభంజనం: స్థానిక ఎన్నికల్లో వార్ వన్ సైడ్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల రెండో విడత ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. సిద్దిపేట నియోజకవర్గంలో ఫలితాలు 'వార్ వన్ సైడ్' అన్నట్లుగా ఏకపక్షంగా వెలువడ్డాయి. సిద్దిపేట నియోజకవర్గంలో మొత్తం 91 సర్పంచ్ స్థానాలు ఉండగా, వాటిలో అధికభాగం బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. అందిన సమాచారం ప్రకారం, బీఆర్‌ఎస్ మద్దతుదారులు ఇప్పటికే 80 సర్పంచ్ స్థానాలను గెలుచుకుని తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఇది బీఆర్‌ఎస్ పార్టీకి సిద్దిపేటలో ఉన్న పట్టును, బలమైన సంస్థాగత నిర్మాణాన్ని మరోసారి స్పష్టం చేసింది.

ఈ ఫలితాల ప్రకారం అధికార కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో కేవలం 5 సర్పంచ్ స్థానాలకే పరిమితమైంది. అలాగే, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మద్దతుదారులు కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగారు. మిగిలిన స్థానాలు ఇతరులు, స్వతంత్ర అభ్యర్థుల ఖాతాలో చేరాయి. ఈ ఫలితాలు సిద్దిపేట రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌కు ఎదురులేదని, గ్రామీణ స్థాయిలో కూడా ఆ పార్టీ పట్టు చెక్కుచెదరలేదని నిరూపించాయి. ఈ ఎన్నికల ద్వారా బీఆర్‌ఎస్ నాయకత్వం తమ పట్టును మరింత బలోపేతం చేసుకున్నట్లు కనిపిస్తోంది.

Next Story