- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బనకచర్ల వివాదానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం : మంత్రి ఉత్తమ్
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గోదావరి నది పై దేవాదుల సీతారామ సీతమ్మధార సమ్మక్క సారక్క గౌరవెల్లి తుమ్మిడి హాట్టి వంటి ప్రాజెక్టు కట్టి ఉంటే బనకచర్ల వివాదం ఉండేది కాదని గోదావరి నీళ్లు సముద్రంలోకి వెళ్తున్నాయని ఏపీ రాష్ట్రం బనకచర్ల ప్రాజెక్టు తెరమీద తెచ్చిందని రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

దిశ, హుజూర్ నగర్ : గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గోదావరి నదిపై దేవాదుల సీతారామ సీతమ్మధార సమ్మక్క సారక్క గౌరవెల్లి తుమ్మిడి హాట్టి వంటి ప్రాజెక్టు కట్టి ఉంటే బనకచర్ల వివాదం ఉండేది కాదని గోదావరి నీళ్లు సముద్రంలోకి వెళ్తున్నాయని ఏపీ రాష్ట్రంలో బనకచర్ల ప్రాజెక్టు తెరమీద ఏపీ ప్రభుత్వం తెచ్చిందని రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ గ్రామ సమీపంలోని కృష్ణా నదిపై 302 కోట్లతో నిర్మాణం జరుగుతున్న జవహర్ జాన్ పహాడ్ లిఫ్ట్ పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో కలిసి పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడి హేట్టి వద్ద డిజైన్ చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తిచేస్తే 38వేలకోట్లతో పూర్తయి 17 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని మిగిలిన 62 వేల కోట్లతో కృష్ణ గోదావరి నదులపై ఉన్న అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యేదని వ్యాఖ్యానించారు. కాలేశ్వరం పేరుతో గత ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చు పెట్టి లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదని విమర్శించారు. కాలేశ్వరం రైతుల ప్రయోజనం కోసం కాదని వారి వ్యక్తిగత ప్రయోగం కమీషన్ల కోసమే నిర్మించారని మండిపడ్డారు.కాళేశ్వరం డిజైన్ చేసింది వాళ్లే ..కట్టింది వాళ్లే కూలింది కూడా ఆ ప్రభుత్వంలోనే అన్నారు.
కాళేశ్వరం మీద తెచ్చిన లక్ష కోట్ల అప్పుకు ప్రతి సంవత్సరం 16 వేల కోట్ల రూపాయలను వడ్డీగా కడుతున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలు అన్నిటిని సరిచేస్తున్నామని తెలిపారు. కృష్ణానది మిగులు జలాలలో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయిస్తే అందులో ఆంధ్రకు 512 టీఎంసీలు తెలంగాణకు 299 టీఎంసీలు చాలు అని అప్పటి ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి లిఖితపూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి రాసి ఇచ్చారని గుర్తు చేశారు. పంటల సాగుకు ప్రజల అవసరాల కోసం ఆంధ్ర కంటే తమకే ఎక్కువ వాటా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి చెప్పామని ప్రస్తుతం అది పరిశీలన ఉందని చెప్పారు. గత ఖరీఫ్ రబీ సీజన్లో రెండు పంటలు కలిపి వండులక్షల 281 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పన్నిందని ధాన్యం అత్యధిక పండించిన రాష్ట్రాలలో నెంబర్ వన్ గా ఉందని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందని మంత్రి చెప్పారు. ఇంత దాన్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని గతంలో ఎన్నడూ పండలేదని తెలిపారు.
రైతు భరోసా కింద ఒక ఎకరానికి రైతులకు 6000 చొప్పున 9000 కోట్ల రూపాయలను రైతులకు నేరుగా వారి ఖాతాలో జమ చేశామన్నారు. ఇచ్చంపల్లి వద్ద గోదావరి జలాలను నాగార్జునసాగర్ లో కలుపుతామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి కేంద్ర ప్రభుత్వం నిధులతోనే చేపడతామంటే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించిందని పేర్కొన్నారు. పదేళ్లపాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ను నిర్వీర్యం చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1100 మంది ఇంజనీర్లను 1800 మంది లస్కర్లను నియమించామని అన్ని విధాలుగా ఇరిగేషన్ శాఖ పనితీరును మెరుగుపరిచామన్నారు. అలాగే కృష్ణ గోదావరి నదులపై ఉన్న అన్ని నిర్మాణపు ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నామన్నారు. కృష్ణ గోదావరి జిల్లాలలో తెలంగాణకు అన్ని విధాలుగా న్యాయం జరిగేలా మేము పోరాటం చేస్తుంటే .. గత పాలకులు రోజు ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. హరీష్ రావు పదే పదే తప్పులను నిజాలు చేసే గోబల్ ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు పేరుకు బదులుగా గోబల్ రావు అని పెట్టుకుంటే బాగుంటుందని హేడ్డేవా చేశారు .
హరీష్ రావు చెప్పేవన్నీ పచ్చి అబద్దాలని గోబాల్ కి వారసులు వారే అనే మండిపడ్డారు. వారి అబద్ధాలు గోబల్స్ కూడా మించిపోతున్నాయని అన్నారు. ఈ సమావేశంలో ఆయన వెంట ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ మాజీ ఎంపీపీ భూక్యా .గోపాల్ మాజీ జడ్పిటిసి మాలోత్ బుజ్జి మోతిలాల్ మండల పార్టీ అధ్యక్షులు సుబ్బారావు నేరేడుచర్ల మండల పార్టీ అధ్యక్షులు కోణతం చిన్న వెంకటరెడ్డి నేరేడుచర్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెల్లంకొండ విజయలక్ష్మి నరసింహారావు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సురేష్ రెడ్డి బైరెడ్డి జితేందర్ రెడ్డి వెంకటి ముజావర్ జానీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






