KTR: పరిస్థితి చూస్తుంటే జరగబోయేది ఇదే.. లోకల్ ఎన్నికలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-09-29 08:03:53  IST  )

కాంగ్రెస్ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని కేటీఆర్ అన్నారు.

KTR:  పరిస్థితి చూస్తుంటే జరగబోయేది ఇదే.. లోకల్ ఎన్నికలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికలు ఏవైనా గెలుపు బీఆర్ఎస్ పార్టీదేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజలు మళ్లీ కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారని, తాజా పరిస్థితులు చూస్తే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ ఎన్నికలైనా బీఆర్ఎస్ కు అనుకూలత కనిపిస్తున్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు పిచ్చి కోపంతో అన్నారని చెప్పారు. ఉన్న నగరాన్ని పట్టించుకునే దిక్కులేదు కానీ కొత్త నగరాన్ని కడతానని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఫోజులు కొడుతున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు గ్యారెంటీ కార్డులతో కాంగ్రెస్ పార్టీ గారడీ చేసిందని ఈ మోసాన్ని గుర్తు చేసేందుకే మేము బాకీ కార్డులను తీసుకువచ్చామన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని అన్ని వర్గాలకు బాకీ పడిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన అభయహస్తం కాస్త భస్మాసుర హస్తం అని తేలిపోయిందన్నారు.

Next Story