BRS Raithu Mahadharna : బీఆర్ఎస్ రైతు మహాధర్నా మరోసారి వాయిదా

by Muthe.Rajitha |

బీఆర్ఎస్(BRS) కు మరో షాక్ తగిలింది.

BRS Raithu Mahadharna : బీఆర్ఎస్ రైతు మహాధర్నా మరోసారి వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్(BRS) కు మరో షాక్ తగిలింది. అనుమతులు లేకపోవడంతో రేపు నల్గొండ(Nalgonda)లో కేటీఆర్(KTR) చేపట్టాల్సిన రైతు మహాధర్నా(Raithu Mahadharna) మరోసారి వాయిదా వేసుకుంది. రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో గులాబీ నేతలు హైకోర్టు(High Court)కు వెళ్లారు. మహాధర్నాకు పోలీసులను అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్(Lunch Motion Pitition) దాఖలు చేశారు. కాగా పార్కింగ్, ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో అనుమతి ఇవ్వలేదని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. అయితే ఈనెల 26 తర్వాత రద్దీ ప్రాంతంలో కాకుండా వేరే ఎక్కడైనా సభ ఏర్పాటు చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్ట్.. పోలీసుల అనుమతిపై తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. అనంతరం విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.

Next Story