TG: కొత్త పార్టీ ఊపులో కవిత.. భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్న బీఆర్ఎస్!

by Gantepaka Srikanth |

రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ నెలకొనబోతున్నదా..? తాజాగా ప్రారంభమైన కవిత పార్టీపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తున్నది.

TG: కొత్త పార్టీ ఊపులో కవిత.. భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్న బీఆర్ఎస్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ నెలకొనబోతున్నదా..? తాజాగా ప్రారంభమైన కవిత పార్టీపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా పార్టీ పేరు తమ పార్టీకి పోలి ఉన్నాయని పేర్కొంటూ ఎన్నికల సంఘం (ఈసీ) వద్ద ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. బీఆర్ఎస్ వర్గాల ప్రకారం.. కవిత పార్టీ ఉపయోగిస్తున్న పేరు ఓటర్లలో గందరగోళానికి దారి తీసే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, చదువు తక్కువగా ఉన్న ఓటర్లు ఈ పోలికల వల్ల తప్పుగా ఓటు వేయవచ్చని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కారణంగా ఈసీ జోక్యం అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు. ఆ పార్టీకి పర్మిషన్ ఇవ్వొద్దని ఈసీ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధం అవుతున్నారని తెలిసింది.

కవిత తన పార్టీని తెలంగాణ రాష్ట్ర సేనగా పేర్కొనడంపై అభ్యంతరాలు తెలుపుతున్నట్లు సమాచారం. చివరి పదం సమితికి బదులు సేన అని మార్చి పెట్టినా అది టీఆర్ఎస్‌ను పోలి ఉండడంతో ఈసీ దృష్టికి తీసుకెళ్లి అడ్డుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చినప్పటికీ టీఆర్ఎస్‌కు ఇంకా ఆరేళ్లు లాక్ పీరియడ్ ఉంది. దాంతో గడువు పూర్తికాకుండానే టీఆర్ఎస్‌ను పోలిన పేరును పెట్టడం నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అయితే.. తెలంగాణ రాష్ట్ర సేనకు ఈసీ ఆమోదం ఉన్నదో లేదో ఆరా తీస్తున్నట్లుగా తెలిసింది. ఆ తరువాతే ఈసీకి అభ్యంతరాలు చెబుతామని పార్టీ వర్గాలు తెలిపాయి.

Next Story