BRS: ఎమ్మెల్సీ కవిత ఫోటోలు మార్ఫింగ్.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

by Ramesh Goud |

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) ఫోటోలు మార్ఫింగ్ చేసిన వ్యక్తులపై తెలంగాణ జాగృతి మహిళా విభాగం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

BRS: ఎమ్మెల్సీ కవిత ఫోటోలు మార్ఫింగ్.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) ఫోటోలు మార్ఫింగ్ చేసిన వ్యక్తులపై తెలంగాణ జాగృతి మహిళా విభాగం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల నిజామాబాద్(Nizamabad) లో జాతీయ పసుపు బోర్డు(National Turmeric Board)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో బీఆర్ఎస్ నేత కవిత పోరాటం వల్లే పసుపు బోర్డు వచ్చిందని, ఎవరైనా కవితకు క్రెడిట్ ఇస్తారేమోనని వేచి చూస్తున్నారంటూ.. కవిత ఫేస్ మార్ఫింగ్ చేసిన ఫోటోలను(Marfing Photos) కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి. దీనిపై స్పందించిన తెలంగాణ జాగృతి మహిళా విభాగం(Telangana Mahila Jagruthi) సైబర్ క్రైం పోలీసులను(Cyber Crime) ఆశ్రయించింది. కవిత ఫోటోలను మార్ఫింగ్ చేసి, పోస్ట్ చేసిన సోషల్ మీడియా హ్యాండిల్స్ తో పాటు దీని వెనుక ఉన్న వ్యక్తులపై కూడా చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే మార్ఫింగ్ ఫోటోలను సోషల్ మీడియా నుంచి రిమూవ్ చేయాలని కోరింది.

Next Story