- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MLC Kavitha: కవితకు సీపీఎం సంపూర్ణ మద్ధతు.. జాన్‌వెస్లీతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భేటీ
బీసీల కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న ఉద్యమానికి సీపీఎం సంపూర్ణ మద్ధతిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రకటించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: బీసీల కోసం ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) చేస్తున్న ఉద్యమానికి సీపీఎం సంపూర్ణ మద్ధతిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ (CPM State Secretary John Wesley) ప్రకటించారు. ఇవాళ హైదరాబాద్‌లోని సీపీఎం స్టేట్ ఆఫీస్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) న్యాయమైన డిమాండ్ అని చెప్పారు. సామాజిక న్యాయం కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. రిజర్వేషన్లను పెంచి అసమానతలను తొలగించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని అన్నారు. బీజేపీ సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉంటుందని మండిపడ్డారు.
మొన్నటి వరకు కులగణనను కూడా బీజేపీ పార్టీ వ్యతిరేకించిందని, ప్రజా ఉద్యమాలకు తలొగ్గి కులగణన చేయడానికి ముందుకొచ్చిందని అన్నారు. రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర బీజేపీ నాయకులు నోరు విప్పడం లేదన్నారు. 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి చేసే బాధ్యత బీజేపీ నాయకులపై కూడా ఉందన్నారు. కేవలం కేంద్రానికి వినతి పత్రాలు అందించే వరకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పరిమితం కావొద్దని సూచించారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం- కవిత
ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం గత రెండేళ్లుగా ఉద్యమిస్తున్నామని అన్నారు. అందులో భాగంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీ ఆమోదించిందని, రాష్ట్రపతి ఆమోదానికి బిల్లు మూడు నెలల క్రితమే వెళ్లినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఢిల్లీకి వెళ్లడంలో హాఫ్ సెంచరీ చేసినా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మెడీతో ఈ అంశంపై మాట్లాడకపోవడం శోచనీయమని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలంటే ఉద్యమబాటనే మార్గం అని భావించారు.
జూలై 17న రైల్ వ్యవస్థను స్థంభించే విధంగా రైల్ రోకో చేపట్టబోతున్నామని చెప్పారు. కలిసివచ్చే భావసారుప్యతగల శక్తులన్నింటినీ మద్దతు కోసం కలుస్తున్నామని అన్నారు. ఉద్యమాలకు పేరెన్నికగల సీపీఎం పార్టీ నాయకులను కూడా కలిశామని చెప్పుకొచ్చారు. బిల్లు ఆలస్యమైతే బీసీలు ఉద్యోగులు, విద్యార్థులు రిజర్వేషన్లలో వాటాను కోల్పోతారని హెచ్చరించారు.






