Dasoju Sravan: ఈగల్ పేరిట రేవంత్ డ్రామాలు

by Gantepaka Srikanth |

డ్రగ్స్, గంజాయి కట్టడికి ఈగల్ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని.. ఆచరణలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ కుమార్ అన్నారు.

Dasoju Sravan: ఈగల్ పేరిట రేవంత్ డ్రామాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: డ్రగ్స్, గంజాయి కట్టడికి ఈగల్ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని.. ఆచరణలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ కుమార్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నగర నడిబొడ్డున కల్తీ కల్లుతో ఏడుగురు మరణించారని.. సీఎం దగ్గరే హోం శాఖ ఉన్నా ఇంతవరకు స్పందించలేదని పేర్కొన్నారు. పేదలంటే రేవంత్‌కు చులకనా అని.. ఆయనకు మానవత్వం లేదని అన్నారు. ఎక్సయిజ్ శాఖ మంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు. కల్తీ కల్లు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని.. కల్తీ కల్లు కట్టడికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కల్లు దుకాణాలు నడుపుతున్న వారు కాంగ్రెస్ నేతలనే సమాచారం ఉందని.. వారు ఏ పార్టీ అని చూడకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ టీడీపీ నేత నారా లోకేష్‌కు భారతీయ సాంస్కృతిక వైభవం పేరిట ఇచ్చిన చిత్రపటంలో తెలంగాణ మ్యాప్ లేకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించడమే అని పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీ తెలంగాణ ఏర్పాటును ఇంకా గుర్తించడం లేదా అని నిలదీశారు. బండి సంజయ్ ఈ వ్యవహారంపై ఎందుకు స్పందించరని.. ఆయన ప్రశ్నించకుంటే తెలంగాణ వ్యతిరేకిగానే భావించాల్సి ఉంటుందన్నారు. జరిగిన తప్పిదానికి టీడీపీ, బీజేపీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story