MLC: కోదండరాంపై ప్రేముంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నిలబెట్టండి

by Gantepaka Srikanth |

కోదండరాం(Kodandaram)పై సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) మొసలి కన్నీరు కారుస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ కుమార్(Dasoju Sravan) అన్నారు.

MLC: కోదండరాంపై ప్రేముంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నిలబెట్టండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కోదండరాం(Kodandaram)పై సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) మొసలి కన్నీరు కారుస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ కుమార్(Dasoju Sravan) అన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఓయూలో సీఎం సొల్లు పురాణం మాట్లాడారని.. ఆయనను హీరోగా పెట్టి అహనా పెళ్ళంట సినిమా తీయాలని ఎద్దేవా చేశారు. కోదండరాం అంటే అంత ప్రేమ ఉన్నప్పుడు.. ఆయనకు సీఎం పదవి అప్పగించాలని సూచించారు. సీఎం పదవికి రేవంత్‌కు మించి కోదండరాం అర్హులని పేర్కొన్నారు. కోదండరాంతో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించాలని.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నిలబెట్టాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే.. ఓయూకు వెయ్యి కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓయూలో కాళేశ్వరం గురించి రేవంత్‌రెడ్డి మాట్లాడారని.. కోర్టుల్లో ఉన్న అంశాల గురించి ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. కోర్టులను, కోర్టు తీర్పులను అవమానిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం యాదయ్య, శ్రీకాంతాచారి ఆత్మబలిదానాలు చేసుకుంటే రేవంత్‌రెడ్డి ఎక్కడ ఉన్నారని.. చంద్రబాబునాయుడు సంకలో ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని సీఎంకు భయం మొదలైందన్నారు. అలాగే.. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అప్పులపై అబద్ధాలు చెప్పారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు రూ.3 లక్షల 50 వేల 520 కోట్లు అని పార్లమెంటులో కేంద్రమంత్రి చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.

Next Story