- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS: పెంచినవి తగ్గించేదాకా పోరాటం చేస్తాం
పెంచిన బస్ చార్జీలు వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డి.సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పెంచిన బస్ చార్జీలు వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డి.సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ డిమాండ్ చేశారు. చార్జీల భారం ప్రయాణికులపై ఎలా ఉందో ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వారు మంగళవారం ఉదయం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి అసెంబ్లీ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. చార్జీల పెంపుపై ప్రయాణికులు తమ నిరసన వ్యక్తం చేశారు. పేదలపై నెలకు రూ.500 దాకా అదనపు భారం పడుతున్నదని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలతో కలిసి ప్రయాణికులు నినాదాలు చేశారు. అసెంబ్లీ దగ్గర బస్సు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బస్టాప్‌లో మీడియాతో మాట్లాడారు. సామాన్య ప్రజలపై చార్జీల మోతతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల వ్యతిరేక సర్కార్ అని రుజువైందని అన్నారు. ఇప్పటికే వాహనాల పన్ను పెంచారని.. మద్యం ధరలు పెంచారని.. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చార్జీల పెంపునకు రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మార్పుమార్పు అంటే సామాన్య ప్రజలపై అధిక భారం మోపడమేనా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ పేదల పక్షాన పోరాడుతూనే ఉంటుందని.. చార్జీలు దించేదాకా ఒత్తిడి పెంచుతుందని వారు స్పష్టం చేశారు.






