- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: అసెంబ్లీలో మళ్లీ గందరగోళం.. గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
by Gantepaka Srikanth |
తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) హాట్ హాట్‌గా కొనసాగింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు(BRS MLAs) వాడీవేడిగా చర్చ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) హాట్ హాట్‌గా కొనసాగింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు(BRS MLAs) వాడీవేడిగా చర్చ చేశారు. అటు కాంగ్రెస్ సభ్యులు, ఇటు బీఆర్ఎస్ ఇద్దరూ రెచ్చిపోవడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ స్పీకర్ పోడియం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. వారిని మార్షల్స్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. సభ నుంచి బయటకు వచ్చారు. ర్యాలీగా గన్‌పార్కు(Gun Park) వద్దకు వచ్చి నిరసన తెలియజేశారు. అంతకుముందు సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా మార్షల్స్‌తో అదుపు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలను అడ్డుపెట్టుకొని ప్రభుత్వాన్ని నడుపుతారా? అని సీరియస్ అయ్యారు.
Next Story






