సీఎం రేవంత్ రెడ్డికి హైదరాబాద్ నగరం అంటే చిన్న చూపు : ఎమ్మెల్యే కెపి వివేకానంద

by Naga Rani Yarlagadda |

సీఎం రేవంత్ కి హైదరాబాద్ అంటే చిన్న చూపని, మొదటి నుంచి చెత్త నగరంగా చూస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శించారు.

సీఎం రేవంత్ రెడ్డికి హైదరాబాద్ నగరం అంటే చిన్న చూపు : ఎమ్మెల్యే కెపి వివేకానంద
X
  • హైదరాబాద్ నగరంను రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెత్త నగరంగా చూస్తున్నారు
  • తన ఊహల నగరం ఫోర్త్ సిటీ అంటూ సీఎం ఊహల్లో ఉన్నారు

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డికి హైదరాబాద్ నగరం అంటే చిన్న చూపని, మొదటి నుంచి చెత్త నగరంగా చూస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కె.పి.వివేకానంద , డా సంజయ్ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో బుధవారం నాడు ఎమ్మెల్యేలు మీడియా సమావేశంలో మాట్లాడారు. తన ఊహల నగరం ఫోర్త్ సిటీ అంటూ సీఎం ఊహల్లో ఉన్నారని , రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు మెట్రోను రద్దు చేశారని ఆరోపించారు. మూసీ ప్రక్షాళన పేరుతో ఎక్కడ పడితే అక్కడ కూల్చివేతలకు పాల్పడ్డారని, విమర్శలు చేశారు. ఫార్మా సిటీ కట్టాలని బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాన్ని సీఎం రేవంత్ రెడ్డి రద్దు చేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు రాలేదని హైదరాబాద్ నగరం నుంచి ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని కోరితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అజహారుద్దీన్ ను మంత్రిని చేశారని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కళలు కంటే హైదరాబాద్ నగరం ఆగం అవుతుందని ఏద్దేవా చేశారు. . మహేశ్వరం, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్న గ్రామాలను కార్పొరేషన్ లో కలిపి వారికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారో ఎవరికి అర్ధం కావడం లేదన్నారు. అసెంబ్లీని ప్రభుత్వం హుందాగా నడపాలని హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. మంత్రి శ్రీధర్ బాబుకు అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా అనుభవం ఉంది అసెంబ్లీలో వ్యక్తిగత విమర్శలు లేకుండా చూడాలని బిఆర్ఎస్,కాంగ్రెస్ ఎవరైనా వ్యక్తిగత విమర్శలు చేస్తే అడ్డుకోవాలన్నారు. అసెంబ్లీ సమావేశాలను 15 రోజులు నడపాలన్నారు. రాబోవు కొత్త సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ రెట్టింపు ఉత్సహంతో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుందన్నారు.

Next Story