- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్ రెడ్డితో BRS ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ
ఎన్నికల వేళ రాష్ట్రలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో ఖైరతాబాద్ BRS ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ రాష్ట్రలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో ఖైరతాబాద్ BRS ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ అయ్యారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో ఆయన పార్టీ మార్పు ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో పలుమార్లు సమావేశమైన చర్చలు సైతం జరిపినట్లు తెలుస్తోంది.
తాజాగా.. స్వయంగా రేవంత్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్‌గా మారింది. కాగా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. అంతకుముందు 2009, 2018 ఎన్నికలలో ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ, కర్మాగారాలు, పారిశ్రామిక శిక్షణా సంస్థల శాఖ, ఆరోగ్యశాఖ మంత్రిగా కూడా పనిచేశాడు.
Next Story






