Telangana Assembly : అసెంబ్లీలో బీఆర్ఎస్, ఎంఐఎం ఆందోళన

by Muthe.Rajitha |

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో(Telangana Assembly Sessions) బుధవారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రసంగం అనంతరం సభలో గందరగోళం నెలకొంది.

Telangana Assembly : అసెంబ్లీలో బీఆర్ఎస్, ఎంఐఎం ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో(Telangana Assembly Sessions) బుధవారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రసంగం అనంతరం సభలో గందరగోళం నెలకొంది. పార్టీ ఫిరాయింపుల(Party Defections) అంశం సీఎం అసెంబ్లీలో మాట్లాడటంపై ప్రతిపక్షాలు తప్పు పట్టాయి. ఆ అంశం సుప్రీంకోర్టులో ఉండగా ఎలా సభలో ప్రస్తావిస్తారని బీఆర్ఎస్ సభ్యుడు హరీష్ రావు(Harish Rao) మండిపడ్డారు. సభలో ఆయన పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంశం లేవనెత్తారు. దీనిపై బీఆర్ఎస్(BRS), ఎంఐఎం(MIM) సభ్యులు స్పీకర్ పోడియం ఎదుట ఆందోళనకు దిగారు. కాగా ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Utham Kumar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో కూడా న్యాయవ్యవస్థపై చర్చలు జరుగుతాయని, ఆ విషయం ప్రతిపక్షాలు గుర్తుంచుకోవాలని అన్నారు. బీఆర్ఎస్ నేతలు బయట చేస్తున్న వ్యాఖ్యలే సీఎం రేవంత్ రెడ్డి సభలో క్లారిటీ ఇచ్చారని, ఇందులో తప్పేం లేదని మరో మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu) పేర్కొన్నారు. ఈ అంశంపై నిరసనకు అవకాశం ఇవ్వాలని సభలో ప్రతిపక్షాలు పట్టు పట్టాయి.

Next Story