TG: ఎన్నికల కమిషనర్‌ను కలిసిన బీఆర్ఎస్ నేతలు

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మె్ల్సీలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిశారు.

TG:  ఎన్నికల కమిషనర్‌ను కలిసిన బీఆర్ఎస్ నేతలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మె్ల్సీలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(Telangana Election Commission)ను కలిశారు. ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లిలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని ఎన్నికల కమిషనర్‌ను బీఆర్ఎస్ నేతలు కేపీ వివేకానంద, శంభీపూర్ రాజు, దాసోజు శ్రవణ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి కోరారు.

క్యాతనపల్లిలో ఏం జరిగిందంటే..

ఇదిలా ఉంటే.. క్యాతనపల్లిలో బీఆర్ఎస్, సీపీఐ కూటమి అభ్యర్థులు 14 మందితో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతా రామయ్య మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరగా, మార్గమధ్యంలో పోలీసులు వీరిని అడ్డుకున్నారు. అభ్యర్థుల వెంట బాల్క సుమన్‌ను పంపించేందుకు నిరాకరించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కోరం లేక ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి సతీష్ ప్రకటించారు.

ఇబ్రహీంపట్నం పరిస్థితి..

రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి కనిపించకుండా పోవడం, బీఆర్ఎస్ నేతలు తనను తీసుకువెళ్లారని ఆయన చెప్పడంతో చైర్మన్ ఎన్నికను రెండు రోజుల క్రితం వాయిదా వేయగా.. తాజాగా కోర్టు ఆదేశాలతో గ్రీన్‌సిగ్నల్ వచ్చింది.

Next Story