బీఆర్ఎస్ నేతలకు బీజేపీ గాలం.. చక్రం తిప్పుతున్న ఉమ్మడి ఏపీ మాజీ సీఎం

by Disha Web Desk 13 |
బీఆర్ఎస్ నేతలకు బీజేపీ గాలం.. చక్రం తిప్పుతున్న ఉమ్మడి ఏపీ మాజీ సీఎం
X

దిశ, డైనమిక్/ వరంగల్/ ఖమ్మం బ్యూరో:లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో చేరికల రాజకీయం రసవత్తరంగా మారుతున్నది. తాజాగా బీఆర్ఎస్ నేతలకు బీజేపీ గాలం వేస్తోంది. తొలి జాబితా ఇప్పటికే విడుదల చేసిన బీజేపీ రెండో జాబితాపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు లను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఆశించిన సీతారాం నాయక్ తో భేటీ కాగా ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్ రావు భేటీ కావడం సంచలనంగా మారింది. ఎన్నికల నోటిపికేషన్ కు తేదీ సమీపిస్తున్న వేళ బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ దూకుడు పెంచడం ఆసక్తిగా మారింది.

బీజేపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్:

అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి అసంతృప్తితో ఉన్న సీతారాం నాయక్ తాజాగా మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఆశించారు. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఆ స్థానానికి సిట్టింగ్ ఎంపీ మాలోతు కవిత పేరునే ఖరారు చేశారు. దీంతో పార్టీలో తనకు గౌరవం దక్కడం లేదనే అసంతృప్తిలో ఉన్న సీతారాం నయాక్ ఇంటికి కిషన్ రెడ్డి వెళ్లారు. ఈసంద‌ర్భంగా బీజేపీలోకి రావాల‌ని ప్రొఫెస‌ర్‌ను కోరారు. దీనికి ఆయ‌న సానుకూలంగా స్పందించిన‌ట్లుగా తెలుస్తోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం టికెట్ ఆశించి భంగపడిన జలగం వెంకట్రావు సైతం బీఆర్ఎస్ హైకమాండ్ తీరుపై ఆసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఇవాళ కిరణ్ కుమార్ తో భేటీ అయి బీజేపీలో చేరేందుకు సుముత వ్యక్తం చేసినట్లు సమాచారం. వీరు బీజేపీలో చేరితే సీతారాంనాయక్ కు మహబూబాబాద్, వెంకట్రావుకు ఖమ్మం టికెట్ ఆఫర్ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

బీఆర్ఎస్ లో అలజడి:

ఈసారి తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెవలడమే టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీ ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పార్టీలో చేరిన ఇద్దరికి టికెట్లు కన్ఫర్మ్ చేసి వలస వచ్చే వారికి హింట్ ఇచ్చిన అధిష్టానం తాజాగా కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వారిపై గురి పెట్టినట్లు తెలుస్తోంది. కేసీఆర్ నిర్ణయాలపై అసంతృప్తితో ఉన్న సీతారాంనాయక్, జగలం వెంకట్రావులు త్వరలోనే పార్టీని వీడేందుకు సిద్ధం అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో వీరు కాంగ్రెస్ టచ్ లోకి వెళ్లక ముందే బీజేపీ వీరిని టచ్ లోకి తీసుకుంటోందనే చర్చ జరుగుతోంది.ఈ క్రమంలో సీతారాంనాయక్ ఇంటికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడంతో రాష్ట్ర రాజకీయాల్లో వసల రాజకీయం మరోసారి హీటెక్కింది. కాగా ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ దూకుడు నేపథ్యంలో బీఆర్ఎస్ సైతం కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, ఖమ్మం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా ఇదే నియోజకవర్గాలకు చెందిన సీతారాం నాయక్, జలగం వెంకట్రావు పక్క చూపులు చూడటం గులాబీ పార్టీలో తీవ్ర అలజడి రేపుతున్నది. ఇప్పటికే నేతలంతా ఇతర పార్టీల వైపు చూస్తుంటే నోటిఫికేషన్ నాటికి ఎంత మంది లీడర్లు పార్టీలో నిలుస్తారనేది సందేహాంగా మారింది.



Next Story

Most Viewed