BRS: తెలంగాణ బతుకమ్మను అవమానిస్తారా?

by Gantepaka Srikanth |

బుధవారం ప్రపంచ సుందరీమణుల రామప్ప పర్యటనలో భాగంగా కాళ్లను తెలంగాణ మహిళలతో కడిగించి, టవల్‌తో తుడిపించిన ఘటనపై బీఆర్ఎస్ మహిళా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

BRS: తెలంగాణ బతుకమ్మను అవమానిస్తారా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: బుధవారం ప్రపంచ సుందరీమణుల రామప్ప పర్యటనలో భాగంగా కాళ్లను తెలంగాణ మహిళలతో కడిగించి, టవల్‌తో తుడిపించిన ఘటనపై బీఆర్ఎస్ మహిళా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం బుద్ధ భవన్‌లో తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ళ శారదను కలిసి ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మీడియాతో మాట్లాడుతూ.. ఇది తెలంగాణ సంస్కృతి కాదని స్పష్టం చేశారు. సీతక్క లాంటి మహిళా మంత్రులు కడిగితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. సాధారణ మహిళలతో కాళ్లు కడిగించి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మను కూడా అవమానించారని సునీత ఆరోపించారు. మిస్ వరల్డ్ పోటీదారులు చెప్పులు వేసుకొని బతుకమ్మ ఆట ఆడటం తెలంగాణ సంస్కృతికి అవమానకరమని ఆమె అన్నారు. బతుకమ్మ గౌరవాన్ని దెబ్బతీసిన వారిపై మహిళా కమిషన్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

Next Story