- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆయన్ను చూసి రేవంత్ భయపడుతున్నారు.. వేముల ప్రశాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula Prashanth Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula Prashanth Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవు కానీ.. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేయడం దారుణమని మండిపడ్డారు. కమీషన్ల కోసమే మూసీ అభివృద్ధి, ఫ్యూచర్ సిటీ నిర్మాణం అంటూ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. హరీష్ రావును చూసి సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారని అన్నారు. అందుకే నిత్యం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో మక్క, సోయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ నేతలు ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే.. రాష్ట్రానికి కనీసం ఎనిమిది యూరియా బస్తాలు కూడా తీసుకురాలేకపోయారని తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ ఓటు వేసి వృథా అని అన్నారు. ఇది స్వయంగా బీజేపీ ఎంపీలే నిరూపించారని చెప్పారు.






