ఆ 11 రోజులు భయం భయంగా గడిపాం: జగదీష్ రెడ్డి

by Gantepaka Srikanth |

భయం భయంగా గడిపాం: జగదీష్ రెడ్డి

ఆ 11 రోజులు భయం భయంగా గడిపాం: జగదీష్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: నవంబర్ 29 దీక్షా దివస్ తెలంగాణ ప్రజలు అందరికీ స్వాతంత్ర్యం తెచ్చిన రోజు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ పెట్టారు. దేశానికి ఆగస్టు 15 ఎలాగో, మనకు నవంబర్ 29 అలాగే అని అన్నారు. కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి, మొక్కవోని పట్టుదలతో దీక్ష చేసి, ఢిల్లీ మెడలు వంచిన రోజు అని గుర్తుచేశారు.

‘‘కేసీఆర్ దీక్ష చేసిన 11 రోజులు ఒక్కో క్షణం భయంతో గడిపాం.. మా నేతకు ఏమైనా అయితే తెలంగాణ ఎటు పోతుందో అని కన్నీరు పెట్టినం.. కేసీఆర్ మాత్రం నా శవయాత్ర తెలంగాణ జైత్ర యాత్ర ఒకేసారి జరగాలి అన్నారు.. అప్పటిదాకా దీక్ష విరమించేది లేదని పట్టు బట్టారు.. ఆనాటి ఆంధ్రా పోలీసులు, నాయకులు ఎన్నో జిమ్మిక్కులు చేశారు.. అన్నింటిని ఛేదించి తెలంగాణ సాధించాం.. తెలంగాణను అభివృద్ధి చేసుకున్నాం.. ఢిల్లీని గడగడలాడించి బెబ్బులిలా కొట్లాడి.. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ను కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుంటే ఏమనాలో తెలియట్లేదు.

ఇంకోసారి కేసీఆర్ మీద ఎవరు నోరు జారినా ఊరుకోము.. తగిన బుద్ధి చెబుతాం. ప్రస్తుతం తెలంగాణలో లాఠీ పాలన లూఠీ పాలన నడుస్తుంది.. తెలంగాణ కాంగ్రెస్ విముక్త రాష్ట్రంగా అయ్యేంత వరకు పోరాటం చేస్తాం.. అని జగదీష్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ట్వీట్

Next Story