BRS Leader: సీఎంగా రేవంత్ ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదు

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్(Dasoju Sravan) కీలక వ్యాఖ్యలు చేశారు.

BRS Leader: సీఎంగా రేవంత్ ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్(Dasoju Sravan) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. పని లేని వ్యక్తి పిల్లి తల కొరిగినట్లు సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారశైలి ఉందని విమర్శించారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలంగాణపై విషం చిమ్ముతూ నెగటివ్ మైండ్ సెట్‌తో పాలన సాగిస్తున్నారని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ మార్పు విషయంలోనూ రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ తల్లి రూపానికి ఓ చరిత్ర ఉందని గుర్తుచేశారు. 2006లో కేసీఆర్(KCR) కేంద్ర మంత్రిపదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేసినపుడు తెలంగాణ తల్లి రూపం గురించి చాలా మందితో చర్చించారని అన్నారు. తెలంగాణ తల్లి అంటే ఓ దేవత, భూ మాత అని అన్నారు. తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే విధంగా ఉద్యమ ప్రతి రూపంగా తెలంగాణ తల్లి విగ్రహానికి రూప కల్పన చేశారని తెలిపారు.

ప్రస్తుతం తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి విధ్వంసం చేస్తున్నారని అన్నారు. ఓ శాడిస్టు, సైకో పాత్‌లా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని అన్నారు. తెలంగాణ వ్యతిరేకులను సంతృప్తి పరిచేందుకే రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు. విగ్రహాన్ని మార్చడానికి తెలంగాణ రేవంత్ తాత జాగీరా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ పాల్గొనలేదు కాబట్టే రేవంత్ రెడ్డి ఓ శాడిస్టులా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే రేవంత్ రెడ్డి ఈ పాప ప్రయత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సీఎంగా రేవంత్ ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదు.. అలాంటపుడు తెలంగాణ తల్లి మార్పు లాంటి నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకోవచ్చా? అని అడిగారు.

Next Story