మాగంటి గోపీనాథ్ పరిస్థితికి కారణం వాళ్ళే.. BRS నేత సంచలనం !

by velandi.Saikiran |

గులాబీ పార్టీ ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ( Maganti Gopinath) తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిం

మాగంటి గోపీనాథ్ పరిస్థితికి కారణం వాళ్ళే.. BRS నేత సంచలనం !
X

దిశ, వెబ్ డెస్క్: గులాబీ పార్టీ ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ( Maganti Gopinath) తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం చాలా క్రిటికల్ గా ఉందని చెబుతున్నారు. 48 గంటలు దాటితే తప్ప ఆయన పరిస్థితిని.. అంచనా వేయలేమని ఇప్పటికే వైద్యులు ప్రకటించినట్లు గులాబీ నేతలు చెబుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి పై.. ఉద్యమ నేత, BRS ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

బోరబండ గులాబీ పార్టీ నాయకుడు సర్దార్ మృతి నేపథ్యంలో గోపీనాథ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు దాసోజు శ్రవణ్. ఓ కార్పొరేటర్ టార్చర్ భరించలేక...తన కుడి భుజమైన సర్దార్... ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తు చేశారు. అప్పటి నుంచి గోపీనాథ్.. తీవ్ర ఆందోళనలో ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపినట్లు.. మీడియా ముందుకు వచ్చి స్పష్టం చేశారు దాసోజు శ్రవణ్. కనీసం భోజనం కూడా చేయలేదని... రోజంతా సర్దార్ ని తలచుకుంటూ బాధపడేవారని గోపినాథ్ కుటుంబ సభ్యులు చెప్పినట్లు వివరించారు. ఈ నేపథ్యంలోనే గోపీనాథ్ ఆరోగ్యం క్షీణించిపోయిందని స్పష్టం చేశారు. ఆయన త్వరగా కోలుకొని రావాలని.. పేర్కొన్నారు దాసోజు శ్రావణ్.

Next Story