- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కవితలో ఇంత ఆవేదన ఎప్పుడూ చూడలేదు.. ఒకసారి స్వయంగా కలిసి మాట్లాడుతా: మాజీ ఎంపీ
తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనకు కేసీఆర్(KCR) తప్ప మరెవరు బాస్‌లు కారని.. ఆయనొక్కడే బాస్ అని అన్నారు. పార్టీలో కోవర్టులు ఉన్నారని.. వారితో చాలా ప్రమాదం పొంచి ఉందంటూ హాట్ కామెంట్స్ చేశారు. తాజాగా కవిత వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్(Boianapalli Vinod Kumar) స్పందించారు. గురువారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. త్వరలోనే సమస్యలు అన్నీ సర్దుమణుగుతాయని అన్నారు. చిట్‌చాట్‌లోని అంశాలపై షోకాజ్ నోటీస్ ఎలా ఇస్తామని అడిగారు. త్వరలోనే కవితను స్వయంగా కలిసి మాట్లాడుతా. రాజకీయాల్లో ఇలాంటి ప్రకంపనలు సహజం. చాలా పార్టీల్లో ఇలాంటి ప్రకంపనలు చూశాం. అయితే కవితలో మాత్రం ఇంత ఆవేదనను తొలిసారి చూస్తున్నాం. గతంలో బీఆర్ఎస్ అన్ని పార్టీలతో కలిసి పనిచేసింది. ఒక్క బీజేపీతోనే పనిచేయలేదు. చేయదు కూడా’ అని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.






