BRS బీసీ గర్జన సభ వాయిదా.. కారణం ఇదే!

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్(BRS) కీలక నిర్ణయం తీసుకుంది.

BRS బీసీ గర్జన సభ వాయిదా.. కారణం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 14వ తేదీన కరీంనగర్ వేదికగా తలపెట్టిన బీసీ గర్జన బహిరంగ సభను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్(Gangula Kamalakar) ప్రకటన విడుదల చేశారు. కాగా, వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయుటకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ కరీంనగర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ కథనభేరి కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో తేదీ 14, 15, 16, మరియు 17 రోజుల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు ప్రభుత్వ వాతావరణ శాఖ సూచనలు మేరకు బీఆర్ఎస్ బీసీ కథనభేరి సభను వాయిదా వేస్తున్నాము. వాతావరణం అనుకూలించిన తర్వాత నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. త్వరలోనే కొత్త తేదీని వెల్లడిస్తాం. దీనిని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు గమనించాలని గంగుల కమలాకర్ పేర్కొన్నారు.

Next Story