అప్పులపై BRS అసత్య ప్రచారం చేస్తోంది.. డిప్యూటీ సీఎం భట్టి చిట్‌చాట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-30 05:49:05  IST  )

రాష్ట్రంలో ప్రభుత్వం చేసిన అప్పులపై బీఆర్ఎస్ (BRS) పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు.

అప్పులపై BRS అసత్య ప్రచారం చేస్తోంది.. డిప్యూటీ సీఎం భట్టి చిట్‌చాట్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రభుత్వం చేసిన అప్పులపై బీఆర్ఎస్ (BRS) పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. అసెంబ్లీలో కాళేశ్వరం (Kaleshwaram)పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు స్పీకర్ ప్రసాద్‌ కుమార్‌ (Speaker Prasad Kumar)ను కలిసిన విషయంపై ఆయన కీలక వ్యాఖ్యల చేశారు. వాళ్లు పదేళ్లు అధికారంలో ఉన్న నాడు తమకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇచ్చారా అని ప్రశ్నించారు. అయినా.. అసెంబ్లీలో ప్రతిపక్షాలకు పీపీటీ (PPT) ఇచ్చే సాంప్రదాయమే లేదన్నారు. గత సాంప్రదాయాన్నే తాము కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర అప్పుల‌పై బీఆర్ఎస్ పార్టీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అప్పుల‌పై వడ్డీలు ఏమైనా బీఆర్ఎస్ నాయకులు కడుతున్నారా.. అని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ చేసిన అరచకాలను అసెంబ్లీలో బయటపెడుతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

Next Story