కాంగ్రెస్ గుండాగిరి చేస్తోంది: కేటీఆర్

by Gantepaka Srikanth |

హంగ్ వచ్చిన మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. ఎనిమిది పట్టణాలకు సీనియర్ నేతలను ఇన్‌చార్జులుగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు.

కాంగ్రెస్ గుండాగిరి చేస్తోంది: కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: హంగ్ వచ్చిన మున్సిపాలిటీల(Telangana Municipalities)పై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. ఎనిమిది పట్టణాలకు సీనియర్ నేతలను ఇన్‌చార్జులుగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నియమించారు. హంగ్ వచ్చిన ఆ ఎనిమిది ప్రాంతాల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక నేతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గుండాగిరి చేస్తోందని మండిపడ్డారు. కిడ్నాప్‌లు, దాడులు, అక్రమ ఓట్లతో పదవులు పొందిందని ఆరోపించారు. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు ఇవాళ్టి పరిణామాలే నిదర్శనమని అన్నారు. ఎక్స్‌అఫీషియో ఓట్లతో పేరుతో దొంగ ఓట్లు నమోదు చేసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ తొత్తులుగా మారిన పోలీసులపై తెలంగాణ డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పోలీసులపై చర్యలు తీసుకోండి

కేవలం కాంగ్రెస్ నేతల ఒత్తిడి మేరకు కొన్ని ప్రాంతాల్లో చైర్మన్ల ఎన్నికను వాయిదా వేశారని విమర్శించారు. వాయిదా వేసిన అధికారులపై ఎన్నికల సంఘం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా, తెలంగాణలో మొత్తం మున్సిపాలిటీలు 116 ఉండగా.. అందులో కాంగ్రెస్‌ 87, బీజేపీ 1, బీఆర్ఎస్‌ 17 కైవసం చేసుకుంది. మరో 11 మున్సిపాలిటీల్లో ఎన్నిక వాయిదా పడింది. ఏడు కార్పొరేషన్లలో కాంగ్రెస్‌ 5, సీపీఐ-మిత్రపక్షం 1, బీజేపీ 1 కైవసం చేసుకున్నాయి.

Next Story