TG: ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు

by Gantepaka Srikanth |

మూడో వారాల్లో ఇబ్రహీంపట్నం, క్యాతన్‌పల్లిలో రెండుచోట్ల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిందని.. వెంటనే క్యాతన్‌పల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నిక నిర్వహించాలని బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేశారు.

TG: ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మూడో వారాల్లో ఇబ్రహీంపట్నం, క్యాతన్‌పల్లిలో రెండుచోట్ల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిందని.. వెంటనే క్యాతన్‌పల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నిక నిర్వహించాలని బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఎస్ఈసీని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వానికి రాజ్యాంగంపై, కోర్టులపై గౌరవం లేదని.. మున్సిపల్ ఎన్నికల్లో చాలా స్పష్టమైన తీర్పు వచ్చినా ఆ తీర్పును సైతం సీఎం రేవంత్ అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. తాము గెలిచిన చోట్ల ఈ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని దుర్మార్గాలకు పాల్పడుతున్నదన్నారు. ఇబ్రహీంపట్నంలో 13 సీట్లు గెలిచామని.. కాంగ్రెస్ ఏడు మాత్రమే గెలిచిందని.. దాన్ని దుర్మార్గంగా తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నించిందని అన్నారు. అలాగే.. క్యాతన్‌పల్లిలోనూ మాజీ ఎంపీ బాల్క సుమన్‌ను అరెస్టు చేసి అరాచకాలు చేసిందని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పును తొందరగా అమలు చేయాలని ఎలక్షన్ కమిషన్‌ను కోరామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్, బీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, పార్టీ నాయకులు కె.కిశోర్‌గౌడ్, కురువ విజయ్ కుమార్ పాల్గొన్నారు.

Next Story