కడియం కావ్యపై చర్యలు తీసుకోండి.. ఈసీకి బీఆర్ఎస్ కంప్లైంట్

by Gantepaka Srikanth |

వరంగల్ ఎంపీ కడియం కావ్య డబుల్ ఓట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు సోమవారం ఫిర్యాదు చేశారు.

కడియం కావ్యపై చర్యలు తీసుకోండి.. ఈసీకి బీఆర్ఎస్ కంప్లైంట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: వరంగల్ ఎంపీ కడియం కావ్య డబుల్ ఓట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు సోమవారం ఫిర్యాదు చేశారు. కడియం కావ్యకు ఎక్స్అఫిషియోగా రెండు ఓట్లు ఉన్నాయని.. వరంగల్ ఎంపీగా వరంగల్ కార్పొరేషన్‌లో ప్రమాణ స్వీకారం చేసి.. మళ్లీ తొర్రూరులో నమోదు చేయించుకున్నారని ఆరోపించారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు విరుద్ధమని.. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరారు. 30 రోజుల ముందే నోటీస్ ఇవ్వాలని.. కానీ, అలా చేయకుండా ఒకటి రెండు రోజుల్లోనే నమోదు చేయించుకుని ఓటు వేయడానికి సిద్ధం అయ్యారని పేర్కొన్నారు. న్యాయపరంగా చెల్లదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని ఆరోపించారు. రాహుల్‌గాంధీ రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతున్నారని.. ఇక్కడేమో కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ లలితారెడ్డి, పార్టీ నాయకుడు కిశోర్‌గౌడ్ ఫిర్యాదును అందించారు.

Next Story