చిన్నారిని కాలితో తొక్కి చంపిన ఘటనపై డీజీపీకి BRS ఫిర్యాదు

by Gantepaka Srikanth |

నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో రెండు నెలల చిన్నారిని కాలితో తొక్కి హత్య చేసిన ఘటనపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ బృందం ఫిర్యాదు చేసింది.

చిన్నారిని కాలితో తొక్కి చంపిన ఘటనపై డీజీపీకి BRS ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: నాగర్ కర్నూల్(Nagar Kurnool) జిల్లా కుమ్మెర జాతరలో రెండు నెలల చిన్నారిని కాలితో తొక్కి హత్య చేసిన ఘటనపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి(DGP Shivdhar Reddy)కి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ బృందం ఫిర్యాదు చేసింది. నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిషోర్ గౌడ్, ఉపేందర్ చారి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు యాదవ్, నేతలు స్వామి యాదవ్, రాజు తదితరులు ఉన్నారు.

అంతకుముందు.. చిన్నారిని చిదిమేసిన అమానుష ఘటనపై వివిధ పార్టీల నేతలు, బీసీ సంఘాలు భగ్గుమన్నాయి. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, కుల సంఘాల ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. పోలీసులు సైతం బాధితుల పక్షాన కాకుండా అగ్రకుల నాయకులకు అండగా నిలుస్తున్నారని మండిపడ్డారు. ఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా నిందితులఫై చర్యలకు పోలీసులు వెనకాడటాన్ని తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన అగ్రకుల నాయకుల ఫిర్యాదు ఆధారంగా బీసీ కుటుంబంపై కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు.

Next Story