అక్కడొక్కచోటే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా బీఆర్ఎస్ సభలు

by Gantepaka Srikanth |

ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌(BRS) రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోయేలా జరిగిందని బీఆర్‌ఎస్‌ గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల(Mahesh Bigala) అన్నారు.

అక్కడొక్కచోటే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా బీఆర్ఎస్ సభలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌(BRS) రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోయేలా జరిగిందని బీఆర్‌ఎస్‌ గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల(Mahesh Bigala) అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఎల్కతుర్తి సభతో తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్‌ వైపు చూస్తున్నారనే విషయం రుజువైందని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చందని తెలిపారు. ఎల్కతుర్తిలో రజతోత్సవ సభకు కొనసాగింపుగా రాబోయే సంవత్సర కాలం పాటు వివిధ దేశాలలో బీఆర్ఎస్ సభలు నిర్వహిస్తామని మహేష్ బిగాల తెలిపారు. ముందుగా అమెరికాలోని డల్లాస్ నగరంలో DR పెప్పర్ అరేనాలో జూన్ 1, 2025న అట్టహాసంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.

ముఖ్య అతిథిగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)ను ఆహ్వానించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో యూఎస్ఏ కాకుండా వివిధదేశాలలో నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమాలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ప్రముఖ నాయకులూ హాజరుకానున్నారని అన్నారు. పరాయి పాలనలో ప్రజలకు కష్టం వచ్చిన ప్రతిసారీ తెలంగాణ ప్రజలకు గులాబీ జెండా అండగా ఉన్నది. ఇప్పుడు కూడా పాలకులు తప్పు చేస్తే గాడిలో పెట్టే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటున్నది. ఉద్యమం అన్నది జెండా ఊపిరిలోనే ఉన్నదని ఎల్కతుర్తి సభ మరోసారి రుజువు చేసింది.

బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజ‌రీ బోర్డు చైర్మన్ తన్నీరు మహేష్ మాట్లాడుతూ.. 2001 నుంచి బీఆర్‌ఎస్ వెంట నడుస్తున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్ 25వ వసంతంలోకి అడుగుపెట్టడం తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ప్రజలకు గర్వకారణం అన్నారు. ఈ రజతోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున వైభవంగా జరుపుతామన్నారు. వరంగల్ సభకు తీసిపోని విధంగా అట్టహాసంగా నిర్వహిస్తామని తెలిపారు.

Next Story