సహకార సంఘాల్లో నామినేషన్ల కుట్ర.. గవర్నర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు

by Ramesh Naini |

రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా సహకార సంఘాల్లో నామినేటెడ్ వ్యక్తులను నియమించాలని చూస్తున్నదని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆరోపించారు.

సహకార సంఘాల్లో నామినేషన్ల కుట్ర.. గవర్నర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా సహకార సంఘాల్లో నామినేటెడ్ వ్యక్తులను నియమించాలని చూస్తున్నదని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆరోపించారు. శనివారం లోక్‌భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను బీఆర్ఎస్ నేతలు కలిశారు. సింగిల్ విండో చైర్మన్లను కొనసాగించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు సహకార సంఘాల చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని.. 2020లో గెలిచిన చైర్మన్లు 2025 వరకు పదవి కాలం ఉన్నదని.. ఆ తర్వాత వారిని కొనసాగించిందని తెలిపారు.

ఎన్నికలు జరపకుండా వారికి అనుకూలంగా ఉన్న వారిని నామినేట్ చేయాలని చూస్తున్నదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్‌ను కోరామని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్తామని గవర్నర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Next Story