రీకౌంటింగ్‌లో ట్విస్ట్.. 3 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు

by Gantepaka Srikanth |

రీకౌంటింగ్‌లో ట్విస్ట్.. 3 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు

రీకౌంటింగ్‌లో ట్విస్ట్.. 3 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బద్యాతండాలో సర్పంచ్ ఎన్నికల(Telangana Sarpanch Elections) ఓట్ల లెక్కింపులో గందరగోళం చోటుచేసుకుంది. మొదట 1 ఓటు తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారు. రెండోసారి ఓట్లు లెక్కించి 3 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిపించినట్లు ప్రకటించారు. ఇరు పక్షాల ఆందోళలనలతో మూడోసారి అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టారు. దీంతో ఎవరు గెలుస్తారో అని పోటీదారులతో పాటు ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తొలి విడతలో మొత్తం 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా అందులో 395 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. ఇవాళ మొత్తం 3,834 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహించారు.

Next Story