BRS: ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కు బీఆర్ఎస్ నేతల పరామర్శ

by Ramesh Goud |
BRS: ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కు బీఆర్ఎస్ నేతల పరామర్శ
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్(BRS MLA Theegulla Padmarao Goud) ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) పరామర్శించారు. ఇటీవల కుటుంబంతో సహా ఉత్తరాఖండ్(Uttarakhand) పర్యటనకు వెళ్లిన పద్మారావు గౌడ్ కు గుండె పోటు(Heart Attack) వచ్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లి అత్యవసర చికిత్స చేయించారు. దీంతో ఆయనకు ప్రాణాపాయం తప్పినట్టు అయ్యింది. అనంతరం ఆయనను హైదరాబాద్(Hyderabad) కు తీసుకొచ్చారు. దీనిపై సమాచారం అందుకున్న కేటీఆర్ బీఆర్ఎస్ నేతలతో సహా పద్మారావు ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్, పద్మారావు ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. తర్వాత బీఆర్ఎస్ నేతలతో పాటు కేటీఆర్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ను కలిసి ముచ్చటించారు. ఇందులో కేటీఆర్ తో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వీ శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ కవిత సహా పలువురు బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed