- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BRS: బాల్క సుమన్.. చెవిలో పూలు పెట్టు పెట్టుకో.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
బాల్క సుమన్(Balka Suman).. చెవిలో పూలు పెట్టు పెట్టుకో, అందంగా ఉంటావ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: బాల్క సుమన్(Balka Suman).. చెవిలో పూలు పెట్టు పెట్టుకో, అందంగా ఉంటావ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు. తెలంగాణ భవన్(Telangana Bhavan) లో తెలంగాణ విద్యార్ధి విభాగం(Telangana Student Wing) నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేసిందని అన్నారు. ఆరు గ్యారెంటీల(Six Guarentees) పేరుతో 420 హామీలు ఇచ్చిందని, దీనిపై నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన 420 హామీల పుస్తకాలు బీఆర్ఎస్ కార్యకర్తలు(BRS Supporters), నాయకులకు వస్తాయని, ఆ పుస్తకాలు పట్టకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గాంధీ విగ్రహాలకు(Gandhi Statues) వినతి పత్రాలు సమర్పించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
అంతేగాక ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు నాయకులు కూడా వస్తారని, తాను కూడా ఉంటానని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా వినూత్నంగా చేయాలని భావిస్తే చేయాలని సూచించారు. కాంగ్రెస్ నాయకులు చెవిలో పూలు పెట్టారని, మనం కూడా చెవిలో పూలు పెట్టుకొని చేస్తే బాగుంటుందని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ చెప్పారని చెబుతూ.. బాల్క సుమన్ నువ్వు చెవిలో పూలు పెట్టుకో, అందంగా కూడా ఉంటావ్ అన్ని వ్యాఖ్యానించారు. అంతకుముందు కేటీఆర్.. వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి.. 13 నెలలైనా హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ నేతలంతా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చారిత్రాత్మకమైన కార్యక్రమం అంటున్న ముఖ్యమంత్రి భావదారిద్య్రం తెలంగాణ ప్రజలు చూస్తున్నారని ఎద్దేవా చేశారు.
బాండ్ పేపర్లు, అఫిడవిడ్లు ఇచ్చి మరి ప్రజలను మోసగించారని, గోబెల్ సిగ్గుపడేలా అబద్దాలను ప్రచారం చేశారని మండిపడ్డారు. అలాగే ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలాగే తన బిడ్డ కాని బిడ్డను తనదే అని చెప్పుకున్నట్లు ప్రభుత్వ ఉద్యోగాలు భారీగా ఇచ్చినమని చెప్పుకుంటుందని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ అసత్య ప్రచారాన్ని విద్యార్థులకు అర్థమయ్యే విధంగా చెప్పవలసిన బాధ్యత విద్యార్థి విభాగం పైన ఉన్నదని స్పష్టం చేశారు. అంతేగాక కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల మాదిరి.. ఈ పెట్టుబడులు కూడా అంతే అని ప్రజలు బలంగా నమ్ముతున్నారని అన్నారు. ఇక రేవంత్ రెడ్డి చేస్తున్న అబద్ధాల పైనా.. మోసాల పైనా.. ప్రజలకు వివరించి తెలియజెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై ఉందని కేటీఆర్ తెలిపారు.






