- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BRS: రాష్ట్రంలో ఆలీబాబా అర డజన్ దొంగల గ్యాంగ్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో ఆలీబాబా అర డజన్ దొంగల గ్యాంగ్ తిరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) వ్యాఖ్యానించారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఆలీబాబా అర డజన్ దొంగల గ్యాంగ్ తిరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులపై(Congress Leaders) సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన దోపీడీ ముఠా రాష్ట్రంలో తిరుగుతుందని, రేవంత్ సోదరులతో పాటు 6 గురు టీం ను కంపెనీల వసూలు కోసం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తిప్పుతున్నాడని ఆరోపించారు. ఈ ముఠా కంపెనీలను బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూలుకు తెగబడుతున్నదని, వీరు కబ్జాలతో పాటు, భూ దందాలను చేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు.
అలాగే వీరి వసూళ్లను, బ్లాక్మెయిల్ ని, భూ దందాలను పక్కదారి పట్టించడం కోసమే అనేక అంశాలను కాంగ్రెస్ అనవసరంగా తెరమీదకి తీసుకువస్తుందని తెలిపారు. అంతేగాక ఆరు గ్యారెంటీలను అమలు చేసినట్టు చెప్పుకుంటున్న రేవంత్ మాటలు ఈ సంవత్సరం జోక్ అని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ(BRS Party) గురించి రేవంత్ వ్యాఖ్యలు సరికాదని, ఇది ముమ్మాటికి అన్నివర్గాల పార్టీ అని వివరించారు. ఇక హెగ్డేవార్ ను పొగిడిన రేవంత్ రెడ్డినే అసలు సిసలు ఆర్ఎస్ఎస్(RSS) మనిషి అని, ఏబీవీపీలో పనిచేసి, ఆర్ఎస్ఎస్ ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసింది రేవంత్ రెడ్డేనని అన్నారు. ఆయన వేసుకున్న నిక్కర్ కూడా ఖాకీ నిక్కర్ అని గతంలో అసదుద్దీన్ ఒవైసీ అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు.






