బ్రేకింగ్ : షర్మిలకు బెయిల్ మంజూరు

by Disha Web Desk 4 |
బ్రేకింగ్ : షర్మిలకు బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్ డెస్క్: పోలీసులపై దాడి కేసులో వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.30వేలు, ఇద్దరు పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది. షర్మిల విదేశాలకు వెళ్లాలనుకుంటే కోర్టు అనుమతి తీసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం, వారిని కొట్టిన కేసులో పలు సెక్షన్ల కింద ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న షర్మిల సాయంత్రం వరకు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని షర్మిల తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. ఆమెపై నమోదు చేసిన సెక్షన్లన్నీ ఆరు నెలలు, మూడు సంవత్సరాల లోపు జైలు శిక్ష పడేవే అని కోర్టుకు తెలిపారు. పోలీసులు తరపును పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. షర్మిల పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్నారు. షర్మిలపై పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు షర్మిలకు ఊరటనిస్తూ కండిషన్లతో బెయిల్ మంజూరు చేసింది.

Read more:

షర్మిలకు కనీసం రెండేళ్లు శిక్ష పడే ఛాన్స్ : హై కోర్టు అడ్వకేట్ (వీడియో)

Next Story

Most Viewed