ఓడిపోతామనే భయంతోనే కేటీఆర్ తప్పుడు వీడియోలు పోస్ట్ చేశారు : తీన్మార్ మల్లన్న

by Kalyani |
ఓడిపోతామనే భయంతోనే కేటీఆర్ తప్పుడు వీడియోలు పోస్ట్ చేశారు : తీన్మార్ మల్లన్న
X

దిశ, మేడిపల్లి: పట్టభద్రుల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కేటీఆర్ బీఆర్ ఎస్ నాయకులు తనపై తప్పుడు వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ… కేటీ రామారావు నైతిక విలువలు మరచి దిగజారిపోయి తనపై తప్పుడు వీడియోలు పోస్ట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని, దూరదర్శన్ లోగోలు మార్పింగ్ చేసి, ఆర్ టి సి లోగోను మార్పింగ్ చేసి తనపై తప్పుడు వీడియోలు పోస్ట్ చేస్తున్నారని అన్నారు. తాను తప్పుచేసినట్లు వీడియోలు సృష్టించి పోస్ట్ లు చేపిస్తున్నారని కేటీఆర్ పై , మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పి ఏ పై అలానే సోషల్ మీడియాలో వీడియో లు పోస్ట్ చేసిన అందరిపై ఫిర్యాదు చేసానని, వీరందరిని జైలుకు పంపేవరకు ఉరుకుండనని హెచ్చరించారు.

Next Story

Most Viewed