- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: హైదరాబాద్ జీడిమెట్లలో పోలీసుల తనిఖీలు.. కంట్రీ మేడ్ రివాల్వర్, బుల్లెట్లు స్వాధీనం
by Kema Shiva Kumar |
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పోలీసులు సరిహద్దులతో పాటు ప్రధాన చెక్‌పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పోలీసులు సరిహద్దులతో పాటు ప్రధాన చెక్‌పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. నేతలు ఓటర్లను డబ్బు, మద్యం, ఇతర వుస్తువలతో ప్రలోభాలకు గురి చేయకుండా రాత్రింబవళ్లు పకడ్బందీగా పహారా కాస్తున్నారు. అదేవిధంగా రౌడీ షీటర్లు, క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ హైదరాబాద్‌లోని జీడిమెట్లలో పోలీసులు వాహనాల తనిఖీ చేపడుతుండగా.. మధ్యప్రదేశ్‌కు చెందిన విశాల్ దగ్గర కంట్రీమేడ్ రివాల్వర్, మూడు బుల్లెట్లు కూడా లభ్యమయ్యాయి. ఈ మేరకు విశాల్‌ను అదుపులోకి తీసుకుని ఆర్స్మ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. లోక్‌సభ ఎన్నికలే వేళ హైదరాబాద్ నగరంలో కంట్రీ మేడ్ గన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది.
Next Story






