BREAKING: బాధ్యతను మరిచి కాంగ్రెస్ రాజకీయలు చేస్తోంది: మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

by Disha Web Desk 1 |
BREAKING: బాధ్యతను మరిచి కాంగ్రెస్ రాజకీయలు చేస్తోంది: మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బాధ్యతను మరిచి రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ ప్రాజెక్టులపై వాస్తవాలను ప్రజలకు తెలిపేందుకు ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు అక్కడ వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజలకు వాస్తవాలు తెలియానే ఉద్దేశంతో చలో మేడిగడ్డ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నమని పేర్కొన్నారు. కాంగ్రెస్ కేవలం రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని.. ప్రజా సంక్షేమం ముఖ్యం కాదని ఆయన ఎద్దేవా చేశారు.

రానున్న రోజుల్లో తాము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు అన్ని పర్యటిస్తామని తెలిపారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ దెబ్బతింటే రిపేర్ చేయించడానికి ఇబ్బందులు ఏంటో తెలియట్లేదని మండిపడ్డారు. ప్రాజెక్టును నిర్మాణం చేపట్టిన సంస్థపై చర్యలు తీసుకోండి కానీ, రైతులను మాత్రం బలి చేయొద్దని అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుకు రిపేర్ చేయించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, బ్యారేజీ పూర్తిగా కూల్చేందుకు చూస్తున్నారని కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు.

ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. వెంటనే ప్రాజెక్టుకు వెంటనే రిపేర్లు మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్‌‌లో మొత్తం 196 స్కీములు ఉన్నాయని తెలిపారు. అందులో ఓ బ్యారేజీ మూడు పిల్లర్లు కుంగితే భూతద్దంతో పెట్టి చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ కేవలం కుంగింది.. తెగలేదని స్పష్టం చేశారు. రాజకీయ పబ్బం గడపడానికి రైతులను ఫణంగా పెట్టొద్దని, వారిని ఇబ్బంది పెడితే ప్రభుత్వానికే నష్టమని పోచారం శ్రీనివాస్ రెడ్డి హితవు పలికారు.

Next Story

Most Viewed