BREAKING: హైదరాబాద్‌లోని ఉప్పల్‌ పీఎస్ పరిధిలో దారుణం.. భార్యను కడతేర్చిన భర్త

by Disha Web Desk 1 |
BREAKING: హైదరాబాద్‌లోని ఉప్పల్‌ పీఎస్ పరిధిలో దారుణం.. భార్యను కడతేర్చిన భర్త
X

దిశ, వెబ్‌డెస్క్: కట్టుకున్న భార్యను భర్తే కడతేర్చిన విషాద ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శివలక్ష్మి, శివమోహన్ శర్మ భార్యభర్తలు. అయితే, కొన్నాళ్ల నుంచి భార్యపై అనుమానంతో శివమోహన్ శర్మ రగిలిపోతున్నాడు. ఈ క్రమంలో వారిద్దరికీ నిత్యం ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మరోసారి వారిద్దరు గొడవపడగా ఆవేశంలో భర్త శివమోహన్ శర్మ, భార్యపై దాడి చేసి చంపేశాడు. అనంతరం కుమారుడికి ఫోన్ చేసి శివలక్ష్మిని తానే చంపానని సమాచారం ఇచ్చి శివమోహన్ శర్మ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed