తెలంగాణలో టీచర్ల బదిలీలకు బ్రేక్

by Disha Web Desk 2 |
తెలంగాణలో టీచర్ల బదిలీలకు బ్రేక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో టీచర్ల బదిలీలకు బ్రేక్ పడింది. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల బదిలీపై ఈనెల 19 వరకు స్టే విధిస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పదోన్నతుల తర్వాతే బదిలీలు చేయాలని రంగారెడ్డి జిల్లా టీచర్ల తరపున దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ జువ్వాడి శ్రీదేవి బెంచ్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపున న్యాయవాది బాలకిషన్ రావు వాదనలు వినిపించారు. వాదనలు విన్న జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.. టీచర్ల బదిలీ ఈ నెల 19 వరకు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా, రంగారెడ్డి జిల్లాలో సీనియార్టీపై, పదోన్నతులకు టెట్‌ అర్హత కేసులుండటం, పదోన్నతులపై స్టే ఉన్నందున రాష్ట్రంలో రెండు మల్టీ జోన్లలో పదోన్నతులు చేపట్టకుండా కేవలం బదిలీలు మాత్రమే చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీనిపై రంగారెడ్డి టీచర్లు కోర్టుకు వెళ్లగా న్యాయస్థానం బదిలీలపై స్టే ఇచ్చింది.

Next Story