మాజీ మంత్రి ఎర్రబెల్లికి ఫోటో నిరాకరించిన బ్రహ్మానందం! (వీడియో)

by Prasad Jukanti |   (  Updated:2025-11-23 07:10:21  IST  )

మాజీ మంత్రి ఎర్రబెల్లికి బ్రహ్మానందం ఫోటో నిరాకరించిన వీడియో వైరల్‍గా మారింది.

మాజీ మంత్రి ఎర్రబెల్లికి ఫోటో నిరాకరించిన బ్రహ్మానందం! (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: కామెడీ కింగ్ బ్రహ్మానందం ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు పూస్తాయి. అలాంటి బ్రహ్మనందం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍తో ఒక్క ఫోటో దిగేందుకు నిరాకరించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‍గా మారింది.సినీ పరిశ్రమలో మోహన్‌బాబు 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా నవంబర్ 22న హైదరాబాద్ లో MB50-A Pearl White Tribute పేరుతో ఒక్ గ్రాండ్ సెలబ్రేషన్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఈవెంట్ సందర్భంగా అక్కడికి వస్తున్న బ్రహ్మానందంను చూసి అన్నా ఒక్క ఫోటో అంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు చెయ్యి పట్టుకుని బ్రహ్మానందాన్ని ఆపే ప్రయత్నం చేశారు. అయితే ఎర్రబెల్లి ఆపుతున్నా బ్రహ్మీ మాత్రం ఆగకుండా అబ్బే... అనుకుంటూ ఎర్రబెల్లి చేయిని పక్కకు తోసేసుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. దీంతో చేసేదేమి లేక ఎర్రబెల్లి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో పై నెటిజన్లు స్పందిస్తున్నారు.పవర్‍లో లేకపోతే ఈ సినిమా వాళ్లు ఎవరిని పట్టించుకోరని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, ఇది అనవసరంగా వివాదం చేయవద్దని ఆ వీడియోలో పూర్తిగా ఫ్రెండ్లీ వాతావరణం కనిపిస్తోందని మరో నెటిజన్ స్పందించారు. మొత్తంగా ఈ వీడియో వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి మరి. వీడియో

Next Story