- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంచాయతీ ఎన్నికలు.. పెళ్లికాకుండానే లవర్‌తో నామినేషన్ వేయించిన ప్రియుడు
తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో నామినేషన్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే నామినేషన్ల వేళ ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది ఉన్నతమైన ఉద్యోగాలను వదులుకుని నామినేషన్లు వేస్తుంటే

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో నామినేషన్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే నామినేషన్ల వేళ ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది ఉన్నతమైన ఉద్యోగాలను వదులుకుని నామినేషన్లు వేస్తుంటే మరికొందరు రిజర్వేషన్ల కోసం ఇతర కులాలకు చెందిన అమ్మాయిలను సైతం పెళ్లి చేసుకుని నామినేషన్లు వేయిస్తున్నారు.
ఇక తాజాగా మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పెళ్లి కాకుండా ఓ యువకుడు తన ప్రేయసితో నామినేషన్ వేయించాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రశేఖర్ గౌడ్ అనే యువకుడు తన ప్రేయసి శ్రీజతో నామినేషన్ వేయించాడు. గ్రామంలో సర్పంచ్ స్థానం ఎస్సీ రిజర్వ్ కావడంతో పెళ్లి కాకుండానే నామినేషన్ వేయించాడు.
ప్రస్తుతం ఆ యువతి బీటెక్ ఫైనల్ ఇయర్ చదవుతోంది. ఇక తమ కూతురు కనిపించకపోవడంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తమకు రక్షణ కల్పించాలి అంటూ ఆ ప్రేమజంట సైతం పోలీసులను ఆశ్రయించింది. తాను చంద్రశేఖర్ ను ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నానని ఎలాంటి ఒత్తిడి లేదని యువతి తెలిపింది. తాళ్లపల్లి ఆడబిడ్డగా తాను బరిలోకి దిగుతున్నానని సపోర్ట్ చేయాలని కోరింది.






